Know about Cyber Fraud: ప్రస్తుతం ప్రపంచం ఇంటర్నెట్ గుప్పిట్లో ఉంది. ఎక్కడ ఏ మూలన ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా నిమిషాలలో సాధ్యమవుతుంది. విద్య, వినోదం, చదువు, వ్యాపారం ఇలా అన్ని విషయాల్లో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. ఏది కావాలన్నా ఇంటర్నెట్లో వెతకడం, దానికి సంబంధించి సంస్థలను తెలుసుకోవడం, అక్కడి నంబర్లకు సంప్రదించడం ద్వారా మన పని చాలా సులభంగా పూర్తవుతుంది. దీనివల్ల సమయం, డబ్బులు ఆదా కావడంతో పాటు ఇంట్లోని ఉండి అన్ని పనులు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇదే సమయంలో నకిలీ వెబ్ సైట్లు, సైబర్ మోసగాళ్ల దాడులు కూడా ఎక్కువయ్యాయి. ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ ఖాతా బ్లాక్ అయ్యింది.. ఆధార్ వివరాలు చెప్పండి అంటూ ఫోన్లు వస్తున్నాయి. వాటిని నమ్మి మనం వివరాలు, ఓటీపీ నంబర్ చెప్పామో మన ఖాతాలో సొమ్ములు ఖాళీ అవుతున్నాయి. పెద్దగా చదువుకోని వారితో పాటు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
జాగ్రత్త అవసరం..
నకలీ వెబ్ సైట్ ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. కంపెనీల అధికారిక వెబ్ సైట్ లలో మాత్రమే ఆన్ లైన్ లో లావాదేవీలు చేయాలని కోరుతున్నారు. పెరిగిన టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం ఉందో, సైబర్ మోసగాళ్ల కారణంగా కూడా భారీ నష్టం జరుగుతోందన్నారు.

No comments:
Post a Comment